Radhe shyam: రాధేశ్యామ్ నుంచి మరో బిగ్ అప్డేట్.. సోలో సాంగ్ రిలీజ్

-

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన తాజా సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం.. ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను టాలీవుడ్‌ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ డెరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కతోంది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది. సంచారి అంటూ సాగే సోలో సాంగ్ ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఇక ఈ సాంగ్ లో ప్రభాస్ తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. అలాగే ఈ పాటలో అమ్మాయిలకు ప్రపోజ్ చేసుకుంటూ లవర్ బాయ్ గా కనిపించాడు ప్రభాస్. మొత్తానికి ఈ సాంగ్ సింపుల్ గా ఉన్న అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమా జనవరి కానుకగా థియేటర్లో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news