BREAKING : సినిమా పరిశ్రమకు కార్మిక శాఖ కొత్త నిబంధనలు

-

సినిమా పరిశ్రమ కు కార్మిక శాఖ కొత్త నిబంధనలు విడుదల చేసింది. 14 సంవత్సరా ల్లోపు పిల్లలు ఇ క పై ఏ రంగాల్లో పని చేయకూడదని తాజాగా కార్మిక శాఖ స్పష్టం చేసింది. సినిమాలో పని చేసే చైల్డ్ ఆర్టిస్టులకు కలెక్టర్ అనుమతి పత్రం తప్పనిసరి చేసింది. సినిమా నిర్మాత, దర్శకుడు ఎవరైనా జిల్లా కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలని పేర్కొంది కార్మిక శాఖ.

ఇక ముందు సినిమాల్లో బాల కార్మికుల పనితీరు పై కలెక్టర్ల అనుమతి తప్పనిసరి అని వెల్లడించింది. ఈ మెరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది కార్మిక శాఖ. సంబందిత చైల్డ్ ఆర్టిస్ట్ నుండి అనుమతి కూడా తప్పనిసరి చేసింది కార్మిక శాఖ. 25% పేమెంట్ జాతీయ బ్యాంక్ లో ఫిక్సిడ్ డిపాజిట్ సంబందిత సినిమా నిర్మాత చేయాలని స్పష్టం చేసింది కార్మిక శాఖ. చైల్డ్ ఆర్టిస్ట్ విద్యకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు ఉండేలా చూసుకోవాలని కార్మిక శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news