ఫెయిల్ ఇంటర్ విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల తక్కువ పాస్ ఫర్సంటేజ్ పై కేసీఆర్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఫెయిల్ అయిన విద్యార్థుల కు న్యాయం చేసే యోచన లో కేసీఆర్ సర్కార్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. మినిమం మార్క్స్ తో పాస్ చేసే ఆలోచన తో ఉన్నట్టు సమాచారం అందుతోంది.
అయితే.. దీని విధి విధానాలు పై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇతర రాష్ట్రాల లో ఎలా ఫలితాలు ప్రకటించారు అనే అంశం పై ఆరా తీస్తున్న విద్యా శాఖ అధికారులు… త్వరలోనే దీనిపై నివేదిక తయారు చేసి.. సీఎం కేసీఆర్ కు అందించనున్నారు. ఆ నివేదిక అందిన అనంతరం.. సీఎం కేసీఆర్ ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. ఒక వేళ ఇదే జరిగితే.. 51 శాతం ఫెయిల్ అయిన విద్యార్థులకు ఊరట లభించనుంది. కాగా.. రెండు రోజుల కింద ప్రకటించిన.. తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో కేవలం 49 శాతమే ఉత్తీర్ణులు అయ్యారు.