ఏపీ సర్కార్ పై ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ 71 డిమాండ్ల పై అధికారులు చర్చించారని.. ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల 1600 కోట్ల బిల్లులు విడుదల పై సానుకూలంగా స్పందించారన్నారు. మార్చి నెల లోపు బకాయిల చెల్లింపులు పూర్తి చేస్తామని అన్నారని.. ఫిట్ మెంట్ పై అధికారులు ఇచ్చిన 14 శాతం ను మేము అంగీకరించటం లేదని మరోసారి చెప్పామని వెల్లడించారు.
ముఖ్యమంత్రికి అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని.. సజ్జల వ్యాఖ్యలతో ఉద్యోగులు ఆందోళన పడుతున్నారని మండిపడ్డారు. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు మాట్లాడుతూ.. ప్రత్యేకంగా 40 అంశాల పై స్పష్టంగా సమావేశాల పేరుతో కాలాయాపన తప్ప మరో ప్రయోజనం లేదన్నారు.
స్పష్టత ఇవ్వకపోతే సమావేశంలో కొనసాగాల్సిన అవసరం లేదని సీఎస్ తో చెప్పామని.. 14.28 శాతం తో ఫిట్ మెంట్ ఇస్తే ప్రతి ఉద్యోగి 4 నుంచి 10 వేల వరకు జీతం తగ్గుతుందని క్యాటగిరీల వారీగా సీఎస్ ముందు పెట్టమన్నారు.
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ..
కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ 14.28 శాతం అని అధికారులు వేసిన లెక్కలు తప్పని చెప్పామని.. ప్రతి పాయింట్ కు లెక్కలతో సహా తప్పుడు అంచనాలు వేశారని నిరూపించామని వెల్లడించారు. సమావేశాల పేరుతో కాలాయాపన చేయవద్దు.. సజ్జల ప్రకటనలు రోజుకో రకంగా ఉంటున్నాయని మండిపడ్డారు.
దీంతో ఏం జరుగుతుందో అర్ధం కావటం లేదని అగ్రహించారు. కూరగాయల వ్యాపారంలాగా చర్చలు జరగటం బాలేదని.. ఉద్యోగ సంఘాల ఊకదంపుడు ఉపన్యాసాలే సరిపోతున్నాయని ఫైర్ అయ్యారు.