తెలంగాణ ప్రజలకు శుభవార్త.. హైదరాబాద్ లో కరోనా మరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

-

తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ లోని ఫ్రూట్ మార్కెట్ వద్ద 1000 పడకల కరోనా సూపర్ స్పెషల్టీ ఆసుపత్రి రానున్నదని.. దానిని త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు హరీష్ రావు. కరోనా కేసుల వైద్యం కోసం.. అదనపు పడకలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని.. కరోనా థర్డ్ వేవ్ వచ్చిన తట్టుకొనే విధముగా 1400 పడకలు హైద్రాబాద్ లో ఏర్పాటు చేయమన్నామని పేర్కొన్నారు.

నిలోఫర్ లో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నామని.. మరో 6 ఆసుపత్రిలో 100 పడకలు చొప్పున ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అందులో భాగంగా వనస్థలిపురం లో 100 పడకలు ఏర్పాటు చేసుకున్నామని.. అందరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 24 లక్షలు హోమ్ ఐసోలాషన్ కిట్లను అందుబాటులో ఉంచుకున్నామని.. పేదల వైద్యం మీదా ఎక్కువ ఖర్చు పెడుతున్నా రాష్ట్రము తెలంగాణ అని కేంద్రం ప్రకటన చేసిందని గుర్తు చేశారు. పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ఇచ్చారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news