మున్సిపాలిటీలలో నివాసం ఉంటున్న ప్రజలకు తెలంగాణ సర్కార్ శుభ వార్త చెప్పింది. ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మీడియా తో మాట్లాడారు.. మన బస్తి దవాఖానాలు దేశానికి ఆదర్శమని.. హైదరాబాద్ నగరం లో ఎక్కువ అవసరం ఉన్న ప్రాంతంలో మరిన్ని బస్తి దవాఖాన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించామని అదేశలు ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే మున్సిపాలిటీలో కూడా బస్తి దవాఖాన్ లో ప్రారంభించనున్నామని ప్రకటించారు. కోవిడ్ దృష్టి లో పెట్టుకొని అదనంగా వైద్యలను ఇక్కడ ఏర్పాటు చేసామని.. త్వరలోనే మున్సిపాలిటీలో కూడా బస్తి దవాఖాన్ లో ప్రారంభిస్తామని వెల్లడించారు.
హైదరాబాద్ లోని ఫ్రూట్ మార్కెట్ వద్ద 1000 పడకల కరోనా సూపర్ స్పెషల్టీ ఆసుపత్రి రానున్నదని.. దానిని త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు హరీష్ రావు. కరోనా కేసుల వైద్యం కోసం.. అదనపు పడకలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని.. కరోనా థర్డ్ వేవ్ వచ్చిన తట్టుకొనే విధముగా 1400 పడకలు హైద్రాబాద్ లో ఏర్పాటు చేయమన్నామని పేర్కొన్నారు. నిలోఫర్ లో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నామని.. మరో 6 ఆసుపత్రిలో 100 పడకలు చొప్పున ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.