ఏపీలో కొత్త‌గా 104 క‌రోనా కేసులు, ఒక మ‌ర‌ణం

-

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు క్ర‌మ క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తున్నాయి. నిన్న పెరిగిన క‌రోనా కేసులు.. ఇవాళ కాస్త త‌గ్గాయి. తాజాగా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఏపీ లో కొత్త‌గా 104 క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు న‌మోదు అయ్యాయి. ఇక కోవిడ్ వల్ల నెల్లూరు లో ఒకరు మరణిం చారు. అలాగే…గడచిన 24 గంటల్లో 133 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని (Recovered) సం పూర్ణ ఆరోగ్య వంతులు అయ్యారు.

ఇక నిన్న ఒక్క రోజే ఏపీ లో 28,209 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,11,56,578 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2060672 లక్షలకు చేరింది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 14489 కి చేర‌గా… ప్ర‌స్తుతం ఏపీలో యాక్టివ్ క‌రోనా కేసుల సంఖ్య 1249గా న‌మోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news