బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురయ్యాడు. మహారాష్ట్ర లోని పన్వేల్ లోని ఫామ్ హౌస్లో శని వారం అర్థ రాత్రి సల్మాన్ ఖాన్ కు పాము కాటేసిందని సంచారం అందుతోంది. పాము కాటు వేయడం తో.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఆస్పత్రిలో చేరారు.
అయితే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను విషం లేని పాము కాటు వేసిందని.. కాబట్టి సల్మాన్ ఖాన్ కు ఎలాంటి ప్రాణ భయం లేదని వైద్యులు చెప్పినట్లు సంచారం అందుతోంది. పాము కాటు వేసిన తర్వాత.. సల్మాన్ ఖాన్ ను నేరుగా నవీ ముంబై కమోతే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ఆయన అనుచరులు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే వైద్యం తీసుకుంటున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.. ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదని పేర్కొన్నారు. ఇక ఈ ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.