సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ లోని కానూరు సిద్ధార్ధ ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. ఈ సందర్భంగా లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభలో భారత న్యాయవ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు అంశంపై ప్రసంగించారు సీజేఐ ఎన్వీ రమణ. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ప్రభుత్వం కంట్రోల్లో ఉంటారని.. దీంతో పీపీలు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ వ్యాఖ్యలు జగన్ సర్కార్ ను ఉద్దేశించే ఆయన అన్నారని తెలుస్తోంది. పీపీల నియామకంలో ప్రత్యేకంగా స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా 4.60 లక్షలు కేసులు పెండింగులో ఉన్నాయని.. ఒక మిలియనుకు 21 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. 46 శాతం మేర కేసులు ప్రభుత్వాలకు సంబంధించినవే ఉన్నాయని.. వాటిల్లో ఎక్కువగా భూ సంబంధిత వ్యవహారాలే ఉంటున్నాయని వెల్లడించారు. దేశంలో చాలా పరిస్తితులు మారాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.