కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 27న కీలక సమావేశం నిర్వహించనుంది. కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులతో ఎలక్షన్ కమిషన్ అధికారులు కీలక భేటి నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి యూనియన్ హెల్త్ సెక్రటరీ రాకేష్ భూషన్ కూడా పాల్గొననున్నారు. రాబోయే 5 రాష్ట్రాల ఎారుటన్నికలు, దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి నెలల్లో దేశంలోని 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్నాయి. అయితే వీటిపై ఇప్పటి నుంచే సందిగ్ధం ఏర్పడింది. దేశంలో కరోనా, ఓమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న క్రమంలో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవతున్నాయి. దీంతో రేపు జరగబోయే సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రచారం ఊపందుకుంది. ఉత్తర్ ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలలో 2022 ఫిబ్రవరి, మార్చిల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. త్వరలోనే ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఈతరుణంలో ఓమిక్రాన్ తీవ్ర రూపం దాలుస్తున్న క్రమంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం సమాలోచన చేస్తోంది.