BREAKING : బండి సంజయ్ “నిరుద్యోగ దీక్ష”ప్రారంభం

-

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన నిరుద్యోగ దీక్ష ప్రారంభమైంది. కాసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు… రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరుకున్న అనంతరం ఈ దీక్షను ప్రారంభించారు.

ఈ సందర్భంగా బీజేపీ నే తలు.. బండి సంజయ్ కుమార్ కు పూలమాలలు వేసి… ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగు, విజయశాంతి, ఈటెల రాజేందర్, గోనె ప్రకాష్, ఇతర బిజెపి నాయకులు పాల్గొన్నారు.

మొదట ఇందిరాపార్క్ దగ్గర నిరు ద్యోగ దీక్ష చేస్తామని… తెలంగాణ బిజెపి నాయకులు అనుకున్నారు. అయితే… తెలంగాణ పోలీసులు ఇందిరా పార్కు వద్ద నిరుద్యోగ దీక్ష చేసుకునేందుకు అనుమతి నిరాకరించారు. కరోనా ఆంక్షలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న నేపథ్యంలో… అనుమతులు లేవంటూ పోలీసులు స్పష్టం చేశారు. ఒక దీంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం లోనే నిరుద్యోగ దీక్ష చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని బిజెపి నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news