టీకా తీసుకోమంటే.. ఏకంగా పోలీస్ అధికారి చేయినే విరగొట్టాడు.

-

దేశంలో ఓ వైపు కరోనా.. మరోవైపు ఓమిక్రాన్ కేసులు ప్రభుత్వాలను, ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో వ్యాక్సినేషన్ కు ప్రాధాన్యం ఇస్తున్నాయి ప్రభుత్వాలు. స్వయంగా ఇళ్ల వద్దకు వచ్చి ప్రజలకు టీకాలు ఇస్తున్నారు ఆరోగ్య సిబ్బంది. అయితే టీకాలు వేసుకునేందుకు కొంతమంది విముఖత చూపిస్తున్నారు. టీకా వేసుకోవాలంటే.. ఆరోగ్య సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నారు. చెట్లు ఎక్కడం, ఇంటి పైకప్పు ఎక్కడం, ఆరోగ్య సిబ్బంది నానా తిట్లు తిట్టడం, టీకా వేస్తే చనిపోతా అంటూ బెదిరించడం మనం చూస్తూనే ఉన్నాం.

అయితే టీకా వేసుకోవాలి అని చెప్పిన ఓ పోలీస్ అధికారితో గొడవ పడిన ఓ వ్యక్తి ఏకంగా ఆ పోలీస్ అధికారి చేయినే విరగ్గొట్టాడు. ఈ సంఘటన రూర్జండ్‌లోని గిరిధ్‌ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉండే మహువర్ గ్రామ ప్రజలకు టీకాలు తీసుకునేలా అవగాహన కల్పించడానికి వైద్యాధికారులు వచ్చారు. వీరితో పాటు పోలీస్ అధికారి కృష్ణ కుమార్‌ మరాండికూడా ఉన్నారు. స్థానికంగా ఉండే రామచంద్ర ఠాకూర్ అనే వ్యక్తికి టీకా గురించి అవగాహన కల్పించి వారి కుటుంబ సభ్యులు టీకా తీసుకునేదలా ఒప్పించేందుకు పోలీస్ అధికారి ప్రయత్నించాడు. దీంతో కోపానికి గురైన ఠాకూర్ కర్రతో దాడి చేయగా..కృష్ణ కుమార్‌ చేయి విరిగిపోయింది. వెంటనే ఠాకూర్ అక్కడి నుంచి పారిపోయాడు. కృష్ణ కుమార్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఠాకుర్‌ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news