పట్టణ ప్రజలకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని…ఉన్న మున్సిపాలిటీల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహా నగరంలోని.. జీహెచ్ఎంసీ పరిధిలో బస్తీ దవాఖానలు సక్సెస్ కావడంతో ఇతర పట్టణాలకు విస్తరణ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జూన్ 2 వ తేదీ వరకు రెండు దశల్లో బస్తీ దవాఖానలను అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్.
కేసీఆర్ సర్కార్ తీసుకున్న బస్తీ దవాఖానల నిర్మాణ నిర్ణయం కారణంగా… పట్టణ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ కానున్నాయి. డయాగ్నొస్టిక్ సహకారంతో ఉచితంగా అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్నయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ జరిగిన వైద్యారోగ్య శాఖ సమీక్ష లో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ఈ విషయాన్ని పేర్కొన్నారు..