ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని తో సినీ నిర్మాత, నటుడు ఆర్. నారాయణ మూర్తి భేటీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ం లో టికెట్ల అంశం పై ఈ మధ్య సినీ వేదిక పై స్పందించిన ఆర్. నారాయణ మూర్తి.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని బహిరంగంగా అప్పీల్ చేసారు.
ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ఆర్. నారాయణ మూర్తి భేటీ కావడం.. ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశానికి వెళ్ళే ముందు నారాయణ మూర్తి మాట్లాడుతూ.. కొన్ని విషయాలు పర్సనల్ గా అడిగి తెలుసుకునేందుకు మంత్రి వద్దకు వచ్చానని పేర్కొన్నారు.
కాగా గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల ధరలను పెంచాలని మొదటి నుండి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ఎక్కడా తగ్గకుండా.. జగన్ సర్కారు ముందుకు వెళ్తోంది.