ఏపీ థియేటర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

-

ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట లభించింది. ఏపీ లో సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. నెల రోజుల గడువుతో నోటీసులు ఇవ్వనున్న జేసీలు.. ఈ గడువు లోపు పెనాల్టీలు కట్టి సరిచేసుకునే వెసులుబాటు కల్పించింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో 9 జిల్లాల్లోని 83 థియేటర్లు మళ్ళీ ఓపెన్ కానున్నాయి.

ఈ మేరకు జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని థియేటర్ యజమానులకు సూచించారు మంత్రి పేర్ని నాని. ఇవాళ ఉదయం మచిలీపట్టణంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని కలిసారు ఇద్దరు థియేటర్ యజమానులు. తమ థియేటర్ లో పై చర్యల విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెల్లారు థియేటర్ యజమానులు. జిల్లా జాయింట్ కలెక్టర్ కు పెనాల్టీ కట్టి దరఖాస్తు తెసుకోవాలని సూచించిన మంత్రి పేర్ని నాని.. సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news