దేశం లోని అన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను అమలు చేసేందుకు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే సినిమా థియేటర్ల పై పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. కాగా తాజాగా తమిళ నాడులో ఎనిమిదో తరగతి వరకు క్లాసులు బంద్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి పది వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించారు.
అదేవిధంగా థియేటర్స్ ,మాల్స్ లో 50 శాతం ఆక్యుపెన్సి ఉండేలా అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 72 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 120 కి చేరుకుంది. ఇక ఇప్పటికే ఢిల్లీ లో థియేటర్లు పూర్తిగా మూసి వేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలకు ప్రభుత్వం అధికారులు ఒమిక్రాన్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సంక్రాంతి తరవాత థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.