ఎంపీ రఘురామకు బిగ్ షాక్.. సిబిఐ చార్జిషీట్ నమోదు

-

వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కు సిబిఐ బిగ్ షాక్ ఇచ్చింది. కన్షర్సియం నుంచి రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో ఎంపీ రఘురామ కృష్ణరాజు తో పాటు ఆయన కంపెనీ, అనుబంధ కంపెనీలు, గుత్తేదారులు, చార్టెడ్ అకౌంట్ లో తో పాటు 16 మందిపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు సిబిఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని రోజు ఒఫ్ఫేన్స్ కోర్టుల సముదాయంలోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో స్పెషల్ జడ్జి ఎదుట ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు వెల్లడించింది.

సిబిఐ ఛార్జిషీటు ప్రకారం… 2018 అక్టోబర్ మాసంలో హైదరాబాద్ కు చెందిన.. ఓ ప్రైవేట్ కంపెనీ, దాని డైరెక్టర్ల పైన ఢిల్లీలోని పీవోడబ్ల్యూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీబీఐ 2019 ఏప్రిల్ 29న ఆ సంస్థ కేసు నమోదు చేసింది. విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీ రఘురామ చైర్మన్ గా ఉన్న ఇండ్ భారత్… కంపెనీ తమిళనాడు డ్యూటీ లో ధర్మల్ విద్యుత్ శక్తి సంస్థను నెలకొల్పుతామనీ… కన్సిరియం నుంచి తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రుణం తీసుకుంది. అయితే ఇందులో… రుణాలు ఎగవేత కేసులో భాగంగా తాజాగా సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news