యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన దీప్తి సునయన, షణ్ముఖ్ జశ్వంత్ చాలా కాలం ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఈ జంట విడిపోతుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. దీనిపై షణ్ముఖ్ స్పందించి.. తన చేతిపై టాటూ ఉన్నంత కాలం కలిసే ఉంటామని కూడా చెప్పాడు. అయితే తాజా గా దీప్తి సునయన సోషల్ మీడియాలో చేసి పోస్ట్ అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఈ పోస్టులో తను షణ్ముఖ్ విడిపోతున్నామని తెలిపింది. ఇద్ధరం ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఇద్దరం పరస్పర అంగీకారంతో బ్రేకప్ అవుతున్నామని తెలిపింది.
మానవ సంబంధాలు ఎంతో విలువైనవి. చిన్నపాటి మనస్పర్ధలే ఎంతటి బంధాన్నైనా విచ్చిన్నం చేయగలవు. యూట్యూబర్ షణ్ముఖ్, దీప్తి సునైనల మద్య ఉన్న బంధం తెంపేసుకున్నారనే వార్త కొంత బాదాకరం.. తాము విడిగా ఉండబోతున్నాం అంటూ దీప్తి సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది.
షణ్ముఖ్ లైఫ్ ఇక్కడి వరకు రావడంలో దీప్తి పాత్ర ఎంత ఉందో షణ్ముఖ్ చాలాసార్లు చెప్పాడు. మరి అలాంటి బంధం తెగటానికి కారణం ఎంటో అందరికీ తెలిసిందే. బిగ్‌బాస్ 5లో షణ్ణు సిరితో చేసిన రచ్చ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హౌస్‌లో ఉన్నప్పుడే షణ్ణుకి కూడా తెలుసు తన ప్రవర్తన వల్ల దీప్తి హర్ట్ అవుతుందని.. కానీ లైట్ తీసుకొని ఎంజాయ్ చేశాడు. దాని పర్యవసనమే ఈ బ్రేకప్. అయితే ఈ మధ్య కాలంలో ఈ జంట విడిపోతుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. దీనిపై షణ్ముఖ్ స్పందించి.. తన చేతిపై టాటూ ఉన్నంత కాలం కలిసే ఉంటామని కూడా చెప్పాడు. అయితే తాజా గా దీప్తి సునయన సోషల్ మీడియాలో చేసి పోస్ట్ తో క్లారిటీ ఇచ్చింది. ఈ పోస్టులో తను షణ్ముఖ్ విడిపోతున్నామని తెలిపింది.
ఇద్ధరం ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఇద్దరం పరస్పర అంగీకారంతో బ్రేకప్ అవుతున్నామని తెలిపింది. ఇద్దరం కలిసి ఉండటానికి ప్రయత్నం చేశామని.. కానీ తమ ఇద్దరి దారులు వేరు అని తెలుసుకున్నామని తెలిపింది. అందుకే విడిపోతున్నామని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ సమయం తమకు చాలా క్లిష్ట మైందని ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రైవసీకి భంగం కలిగించద్దు అని కోరింది.
నిజానికి షణ్ముఖ్ కు టైటిల్ గెలిచేంత ఫాలోయింగ్ ఉన్నా, దీప్తి సపోర్ట్ ఉన్నా రన్నరప్ కావడానికి ముఖ్యకారణం సిరితో అయ్యగారు చేసిన రచ్చే. సిరి వాళ్ల అమ్మ చెప్పిన తరువాత కూడా ప్రెండ్ షిప్ హగ్ అంటూ వెటకారంగా చెయ్యడం పెద్ద మైనస్ అయ్యింది. సిరిని కంట్రోల్ చెయ్యడం, ఎలా ఉండాలో చెప్పడం, తనతో ఎవరైనా మాట్లాడితే హైపర్ కావడం చూసే… పబ్లిక్ బాబును పక్కకునేట్టేశారు. అన్ని కెమెరాలు చూస్తుండగానే మనోడి ఇంత వింత ప్రవర్తనతో దీప్తి ఎంతగా ఇబ్బంది పడిందో ఇన్నిరోజులు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఏది ఏమైనా దీప్తి కరెక్ట్ డిసెషన్ తీసుకున్నావ్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు ఆమె అభిమానులు.
View this post on Instagram