నిన్నటితో పాత సంవత్సరం ముగిసింది. ఇవాల్టి నుంచి 2022 సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులపై చార్జీల పెంపు భారం పడనుంది. ఇవాల్టి నుంచి అసలు వీటిపై అధిక ఛార్జీలు వసూలు చేయనున్నారో తెలుసుకుందాం.
ఏటీఎం ఛార్జీలు : జనవరి ఒకటో తేదీ నుంచి ఏటీఎం చార్జీల మోత మోగనుంది. ఆర్బీఐ జూన్ నెలలో బ్యాంకులు ఏటీఎం చార్జీలు పెంచుకునేందుకు అనుమతించింది. ఈ ఏడాది ఏటిఎం విత్ డ్రా పై చార్జీలు విధించనుంది. ఇంటర్ చేంజ్ ఫీజు నేపథ్యంలో బ్యాంకులకు కొంత ఉపశమనం కలిగించేందుకు ఏటీఎం క్యాష్ విత్ డ్రా ఛార్జీలను విధించింది. పరిమితికి మించి విత్డ్రా చేస్తే ఇక నుంచి చార్జీలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ చార్జీలు ఇరవై ఒక్క రూపాయి వరకు పెంచుకోవచ్చని సూచనలు చేసింది.
ఓలా, ఉబర్ లాంటి సంస్థల నుంచి… బైకు లేదా కారు బుకింగ్ చేసుకుంటే అదనపు భారం పడనుంది. ఈ సర్వీసులపై ఇవాల్టి నుంచి 5 శాతం జీఎస్టీ పడనుంది.ఫుడ్ డెలివరీ సంస్థలపై జిఎస్టి భారం పడనుంది. స్విగ్గి, జొమాటో లాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు జనవరి ఒకటో తేదీ నుంచి జిఎస్టి చెల్లించుకోవాల్సి ఉంటుంది.
దీని ద్వారా వినియోగదారులపై కాస్త భారం పడనుంది. ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరను సవరిస్తూ వుంటారు. ఈ లెక్కన ఇవాల్టి నుంచి గ్యాస్ ధరలు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో లీటర్ విజయ పాలపై రెండు రూపాయలు ఇవాల్టి నుంచి పెరగనుంది.