కేటీఆర్, హరీష్, కెసిఆర్ లను అడ్డంగా నరుక్కుంటూ మాట్లాడతా : జగ్గారెడ్డి

-

కాంగ్రెస్‌ పార్టీ కోసం అవసరం వచ్చినప్పుడు… కేటీఆర్, హరీష్, కెసిఆర్ లను అడ్డంగా నరుక్కుంటూ మాట్లాడతానని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కోవర్ట్ అయితే… రేవంత్ కూడా కోవర్ట్ అని ఫైర్‌ అయ్యారు. ఐదో తేదీ సమావేశంలో ఇవన్నీ మాట్లాడతా..?నని.. పిసిసి ఎందుకు ఇలాంటి అంశాలపై ఎందుకు స్పందించలేదన్నారు. రేవంత్ గురించి నేను చాలా చెప్తానని…కాంగ్రెస్ ఎప్పటి నుండో గట్టిగా ఉందని.. ఎవడో వచ్చి కాంగ్రెస్ ను లేపల్సిన పని లేదని రేవంత్‌ కు చురకలు అంటించారు.

సోనియా, రాహుల్, తర్వాత ప్రియాంక గాంధీ లదే పార్టీ అని… ఇలాంటి వ్యక్తిగత సినిమా చూపిస్తే ఊరుకోమని రేవంత్‌ కు వార్నింగ్‌ ఇచ్చారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటామని.. ఎవరికి నేను బానిస కాదు… నచ్చనివి మాట్లాడతా..? అని స్పష్టం చేశారు. అధిష్టానానికి పూర్తి సమాచారం అందకుండా చేస్తున్నారనే అనుమానం ఉందని చెప్పారు. నేను కోవర్ట్ అయితే….ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా భార్యను ఎందుకు నిలబెడతానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news