తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నారు. బండి సంజయ్ ప్రజాస్వామ్య బద్ధంగా కరోనా నిబంధనలతో ఎంపీ కార్యాలయంలో జాగారణ దీక్ష చేశారని అన్నారు. కానీ పోలీసులు అప్రజాస్వామ్య కరంగా బండి సంజయ్ ను అరెస్టు చేశారని మండి పడ్డారు. పోలీసులు గ్యాస్ కట్టర్ లతో గెట్ల ను కట్ చేసి అరెస్టు చేయడం దారుణం అన్నారు.
బండి సంజయ్ అరెస్టును తాను ఖండిస్తున్నాని తెలపారు. బీజేపీ రాష్ట్ర నాయకులను కలుసు కోవడానికి మాత్రమే వచ్చానని తెలిపారు. రాష్ట్రంలో కరోనా నిబంధనలు ఉన్నాయని తనకు చెప్పారని తెలిపారు. అయితే తను కరోనా నిబంధనలు పాటిస్తు నిరసన చేస్తానని తెలిపారు. అలాగే తనను అడ్డు కోవడానికి పోలీసులకు అనుమతి ఉందా అని ప్రశ్నించానని అన్నారు. కానీ వారి దగ్గర నుంచి సమాధానం లేదని అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తునే గాంధీజీ కి నివాళ్లు అర్పించానని తెలిపారు.