50వేల ప‌రిహారం కోసం తెలంగాణ స‌ర్కార్ ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం..!

-

క‌రోనాతో మ‌ర‌ణించిన కుటుంబాల‌కు రూ.50వేల ప‌రిహారం ఇస్తున్న‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా క‌రోనా బాధిత కుంటుంబాల‌కు ప‌రిహారాన్ని అందించాల‌ని కేంద్రం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఆదేశాలు జారీ చేసింది. దాంతో గ‌తేడాది న‌వంబ‌ర్ లో ద‌ర‌ఖాస్తును ఆహ్వానించగా మొద‌టివిడ‌తలో వ‌చ్చిన‌ 3780 ద‌ర‌ఖాస్తుల‌ను ఆమోదించి ప‌రిహారాన్ని మంజూరు చేశారు.

కాగా తాజాగా ఇంకా ఎవ‌రైనా ప‌రిహారం అందుకునేందుకు అర్హ‌త ఉంటే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. ఈ మేర‌కు విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మీసేవా కేంద్రం ద్వారా ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. ద‌ర‌ఖాస్తు కోసం డెత్ స‌ర్టిఫికెట్ క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్టు స‌ర్టిఫికెట్, ఆధార్ కార్డుల‌ను జ‌త చేయాలి. అంతే కాకండా దీనిపై ఏమైనా అనుమానాలు ఉంటే 040-48560012 ఫోన్ చేసి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చ‌ని డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news