ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు…. నేను ఏయిర్ పోర్ట్ దాకా ప్రాణాలతో తిరిగి రాగలిగాను… మీ సీఎంకు థాంక్స్ చెప్పండి

-

పంజాబ్ ప్రభుత్వం ప్రధాని మోదీ పర్యటనకు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రధాని మంత్రి పర్యటన ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఉన్నా… సరైన ఏర్పాట్లు చేయలేదని కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.

అయితే భద్రతా వైఫల్యాలతో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమం నుంచి అర్థాంతరంగా బాటిండా ఏయిర్ పోర్ట్ కు తిరిగి వచ్చిన క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ప్రాణాలతో ఏయిర్ పోర్టుకు తిరిగి రాగలిగాను.. మీ సీఎంకు థాంక్స్ చెప్పండి’’ అంటూ.. అక్కడ ఉన్న అధికారులతో వ్యాఖ్యానించారు.

పంజాబ్ లో ప్రధాని పర్యటనలో భాగంగా రోడ్డు మార్గంలో వెళుతున్న క్రమంలో హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలో, ప్రధానమంత్రి కాన్వాయ్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నప్పుడు నిరసనకారులు అడ్డుకున్నారు. దాదాపు 15 నుంచి 20 నిమిషాల వరకు ఫ్లై ఓవర్ పైనే చిక్కుకుపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news