సాధారణంగా భీమా అంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ వంటివే గురు వస్తాయి. కానీ నిజానికి పశువులపై కూడా భీమాని తీసుకోచ్చు. ప్రత్యేకంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనేక బీమా పథకాలను రైతుల కోసం తీసుకు రావడం జరిగింది. అయితే చాలా మంది రైతులకి ఈ బీమా కి సంబంధించి పెద్దగా అవగాహన లేదు. అందుకే పశువుల భీమా పధకం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు మీకోసం.
మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేయండి. రైతుల కోసమే ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన బీమా పథకాల్లో రైతు బీమా, పంట బీమా అనేవి రెండు వున్నాయి. రైతు భీమా అంటే రైతుకు ఇన్యూరెన్స్ ని ఇస్తారు. ఒకవేళ కనుక రైతు మరణిస్తే ఈ డబ్బులు కుటుంబానికి వస్తాయి. ఈ రైతు బీమాని కొన్ని చోట్ల ఉచితంగానే ఇస్తున్నారు.
రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు బీమా కల్పిస్తున్నాయి. మరి కొన్ని చోట్ల అయితే సగం ప్రీమియం ని చెల్లించాల్సి ఉంటుంది. అదే పంట బీమా గురించి చూస్తే.. ఈ బీమాలో ఆకాల వర్షం, వరదలు, వాతావరణంలో మార్పులు లాంటి వాటి వలన పంటకి నష్టం కలిగితే అప్పుడు పరిహారం వస్తుంది.
ఇది ఇలా ఉంటే పశువులకు ఏమైనా జరిగితే రైతుకు ఆర్థిక నష్టం జరుగుతుంది. అందుకోసమే పశువులకు కూడా కేంద్ర ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే పశువుల బీమా పథకం. దేశీయ, క్రాస్, బ్రిడ్ జాతులకు ఇది ఉంటుంది. పాడి ఆవులు, గేదెలు, దూడలు, పడ్డలు, ఎడ్లకు బీమా సదుపాయం ఉంది. దీనిని తీసుకోవాలంటే పశువు మార్కెట్ విలువ మొత్తానికి ఏడాది 4 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
పశువు ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు బీమా చేసే సమయంలో సంబంధిత పశువు మార్కెట్ విలువ ఎంతైతే ఉందో అంత మొతాన్ని పరిహారం కింద ఇవ్వడం జరుగుతుంది. అగ్ని ప్రమాదం, వరదలు, తుపానులు, భూకంపం లాంటి ప్రమాదాల వలన పశువులు మరణిస్తే బీమా పరిహారం వస్తుంది. వివిధ రకాల వ్యాధులు, సర్జరీ చేసే సమయంలో పశువులు చనిపోతే కూడా వస్తాయి.