కోహ్లి ఫిట్ గా ఉన్నాడు.. మూడో టెస్టు ఆడుతాడు : కెఎల్ రాహుల్

-

వెన్ను నొప్పితో రెండో టెస్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లి దూరం అయిన విష‌యం తెలిసందే. దీంతో రెండో టెస్టుకు తాత్కాలిక కెప్టెన్ గా కెఎల్ రాహుల్ వ్య‌వ‌హ‌రించాడు. అయితే ప్ర‌స్తుతం విరాట్ కోహ్లి వెన్ను నొప్పి నుంచి పూర్తిగా కొలుకున్నాడ‌ని కెఎల్ రాహుల్ తెలిపాడు. అంతే కాకుండా మూడో టెస్టు కూడా ఆడుతాడ‌ని కెఎల్ రాహుల్ ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లి నెట్స్ లో ప్రాక్టిస్ చేస్తున్నాడ‌ని తెలిపాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ కోసం నెట్స్ లో కష్ట ప‌డుతున్నాడ‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం కోహ్లి పూర్తి ఫిట్ గా ఉన్నాడ‌ని.. మూడు టెస్టుకు సిద్ధంగా ఉన్నాడ‌ని తెలిపాడు.

అలాగే ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ‌మ్మాద్ సిరాజ్ కు కూడా మొద‌టి టెస్టు లోనే గాయం అయింద‌ని తెలిపాడు. గాయం అయిన రెండో టెస్టులో సిరాజ్ ఆడాడ‌ని తెలిపాడు. అయితే ప్ర‌స్తతం సిరాజ్ వైద్యుల పర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడ‌ని తెలిపాడు. అయితే ఇత‌ర ఫాస్ట్ బౌల‌ర్లు ఇషాంత్ శ‌ర్మ‌, ఉమేశ్ యాద‌వ్ మూడు టెస్టుకు రెడీ గా ఉన్నార‌ని తెలిపారు. అయితే మూడు టెస్టుల సిరీస్ లో 1-1 తో రెండు జ‌ట్లు స‌మానం గా ఉన్నాయి. అయితే ఈ నెల 11 నుంచి జ‌ర‌గ‌బోయే మూడో టెస్టు ఇరు జ‌ట్లకు కీల‌కంగా మార‌నుంది. ఈ టెస్టు గెలిచిన వారికే సిరీస్ ద‌క్కుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news