వనమా రాఘవ మాకు దొరకలేదు..ట్విస్ట్‌ ఇచ్చిన పోలీసులు

కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు అరెస్ట్‌ విషయంలో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అసలు వనమా రాఘవ తమకు దొరకలేదంటూ కొత్తగూడెం పోలీసులు ప్రకటించారు.దీంతో పరిస్థితి గందరగోళరంగా మారింది.

రాఘవ కోసం 8 బృందాలుగా ఏర్పడి తెలంగాణ, ఏపీ లో గాలిస్తున్నట్లు పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌ రాజ్‌ స్పష్టం చేశారు. వనమా దొరికితే.. కస్టడీలోకి తీసుకుంటామన్నారు. వనమా రాఘవ పై గతంలలోఓ నమోదైన కేసుల ఆధారం కూడా దర్యాప్తు చేస్తున్నామని… స్పష్టం చేశారు. ఆధారాలు లభిస్తే.. రాఘవపై రౌడీషీట్‌ నమోదు చేస్తామని ఏఎస్పీ తెలిపారు. కాగా…తెలంగాణ రాజకీయాల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వారసుడు వనమా రాఘవ వ్యవహారం ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అయింది. ఇంతకాలం సైలెంట్‌గా సెటిల్‌మెంట్లు వ్యవహారం నడిపించిన రాఘవ…ఇప్పుడు ఒక కుటుంబం ఆత్మహత్యకు కారణమయ్యారంటూ ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.