మరోసారి కరోనా విజృంభిస్తున్న వేళ పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. క్రింది స్థాయి పోలీసులు మొదలు అధికారుల వరకు వారి వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే విధి నిర్వహణ చేపట్టాలని సూచించారు. గత ఏడాది కరోనా బారిన పడి మృతి చెందిన పోలీస్ అధికారులైన బాస్కర్ రావు, దక్షిణ మూర్తి.. సంస్మరణ సభలో పోలీస్ కమిషనర్ శుక్రవారం పాల్గొన్నారు.