మూడో వేవ్ ను సమర్థంగా ఎదుర్కొందామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా వైద్యాధికారులు, ఆశా వర్కర్లతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వైద్యసేవలు దేశానికి ఆదర్శంగా నిలుపుదామని తెలిపారు. రెండో డోసు 100 % పూర్తయ్యేలా పనిచేయాలని చెప్పారు. 15 నుంచి 18 ఏండ్ల వారికి వ్యాక్సినేషన్ వేగం పెంచాలని సూచించారు.