BREAKING : బాధితుడు రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో విడుదల

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపుతున్న పాల్వంచ సుసైడ్‌ కేసులో మరో కీలక వీడియో లభ్యమైంది. బాధితుడు రామకృష్ణ సుసైడ్‌ చేసుకునే ముందు రికార్డు చేసిన మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. రాఘవ తో పాటు తన తల్లి, సోదరి కారణంగా ఆస్తుల పంపకం విషయం లో ఎంతో క్షోభ అనుభవించానంటూ.. పలు వివరాలను ఆయన వీడియో లో చెప్పారు రామకృష్ణ. తన బలవన్మరణానికి సూత్ర ధారి వనమా రాఘవేనని రామకృష్ణ ఆరోపణలు చేశారు.

ucide

తండ్రి ద్వారా న్యాయంగా రావాల్సిన ఆస్తిని అడ్డుకున్నారన్న రామకష్ణ… తనకు అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయవద్దని వేడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

కాగా…. నిన్న రాత్రి వ‌న‌మా రాఘ‌వ ఆచూకీ తెలియ‌డంతో.. పోలీసులు అరెస్టు చేశారు. వ‌న‌మా రాఘ‌వ‌తో పాటు మ‌రో ఇద్ద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. వ‌న‌మా రాఘ‌వ‌ను పాల్వంచ‌లోని స‌బ్ డివిజ‌న్ కార్యాల‌యంలో నేడు తెల్ల‌వారు జాము వ‌ర‌కు పోలీసుల ఈ కేసులో విచారించారు. అయితే ఈ కేసులో వ‌నమా రాఘ‌వ ఏ-2 గా ఉన్నాడు.