కరోనా భీభత్సం… తెలంగాణలో నైట్‌ కర్ఫ్యూ ?

-

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజు కు విపరీతంగా పెరిగి పోతున్నాయి. అయితే..ఈ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. ఆంక్షలు విధించేందుకు కేసీఆర్‌ సర్కార్‌ సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. సంక్రాంతి పండుగ తర్వాత కరోనా ఆంక్షలు విధించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే.. అధికారుల నుంచి సీఎం కేసీఆర్‌ నివేదిక కోరారు. ప్రస్తుతం రోజుకు 2500 పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

కరోనా తీవ్రత, నియంత్రణ పై నేడు కీలక సమీక్ష కూడా నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు వారాలు అత్యంత కీలకంగా కేసీఆర్‌ సర్కార్‌ భావిస్తోంది. కేసుల తీవ్రత, మరణాల సంఖ్య, పెరిగితే ఆంక్షలు తప్పవని.. అధికారులు చెబుతున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ విధిందచే ఛాన్స్‌ ఉంది. అలాగే… బార్లు, పబ్‌ లు, స్కూళ్లు, మాల్స్‌, థియేటర్ల పై తెలంగాణ సర్కార్‌ ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై రెండు రోజుల క్లారిటీ వచ్చే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news