తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి కరోనా నివారణకు బూస్టర్ డోసు డోసు పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ముందుగా బూస్టర్ డోసును 60 ఏళ్లకు పైబడిన ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 60 ఏళ్ల వయస్సు పై బడిన వారి సంఖ్య దాదాపు 8.3 లక్షలు ఉంటుందని తెలిపారు. ముందు వారికి పంపిణీ చేసిన తర్వాతే ఇతరలకు బూస్టర్ డోసు పంపిణీ ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.
అయితే కరోనా వైరస్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ దేశం పై విరుచుకుడుతున్న నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోసు పంపిణీ కి అనుమతి ఇచ్చింది. ముందుగా బూస్టర్ డోసు ను 60 ఏళ్ల వయస్సు పై బడిన వారికి, దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఉండే ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కూడా బూస్టర్ డోసు పంపిణీ ఉంటుందని స్పష్టం చేసింది. అందులో భాగంగా రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో బూస్టర్ డోసు పంపిణీ ప్రారంభం కానుంది.