కరోనా వైరస్, ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా ఆంక్షాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా నైట్ కర్ఫ్యూ ను అమలు చేస్తున్నాయి. తాజా గా ఈశాన్య రాష్ట్రం అయిన త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం కూడా నైట్ కర్ఫ్యూ విధిస్తు నిర్ణయం తీసుకుంది.
జనవరి 10 నుంచి జనవరి 20 వరకు త్రిపుర రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలలో ఉంటుందని తెలిపింది. నైట్ కర్ఫ్యూ తో పాటు మరి కొన్ని ఆంక్షాలను కూడా విధించింది. సినిమా థీయేటర్స్, స్పోర్స్ కాంప్లెస్ లు, పార్క్‌లు, బార్లు 50 శాతం సామార్ధ్యం తో ఉండాలని సూచించింది. జిమ్‌లు, స్విమ్మింగ్ ఫూల్స్ కూడా తక్కువ సామర్థ్యంతో నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే నైట్ కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు మాత్రమే అందుబాటు లో ఉంటాయని త్రిపుర ప్రభుత్వం తెలిపింది.