వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 25 మంది మెడికల్ స్టూడెంట్స్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్‌కు కరోనా రాగా, ప్రస్తుతం ప్రిన్సిపాల్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిసింది. ఒక్కసారిగా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో మిగిలిన విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు.