దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో కర్ఫ్యూ నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
నైట్ కర్ఫ్యూతో పాటు మరికొన్ని ఆంక్షలను విధించింది ఏపీ ప్రభుత్వం. 50 శాతం సామర్థ్యంతోనే థియేటర్లు, మాల్స్ నడవాలని ఆంక్షలు విధించారు. ప్రార్థన మందిరాల్లో తప్పకుండా కోవిడ్ అమలు చేయాలని ఆదేశించారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పని సరి చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దుకాణాల్లో కరోనా నిబంధనలు పాటించాలని.. ఆర్టీసీ బస్సుల్లో మాస్కలు తప్పక ధరిచేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు కూడ అప్రమత్తం అవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలను విధిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది.