గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్, జగన్ సర్కార్ మధ్య టికెట్ల ధరల వివాదం కొనసాగుతోంది. అలాగే… రూల్స్ బ్రేక్ చేస్తూ.. కొంత మంది థియేటర్లు నడిప్తున్నారని… చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలోని చాలా సినిమా థియేటర్లను జగన్ సర్కార్ మూసివేయించింది. దీంతో… థియేటర్ యాజమానులతో సహా ఇటీవల విడుదల పెద్ద సినిమాలో చాలా నష్టం వాటిల్లింది. అయితే.. ఏపీ థియేటర్ల సమస్యలపై తాజాగా తెలంగాణ మంత్రి తలసాని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో థియేటర్ల సమస్యపై తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానని… తలసాని భరోసా కల్పించారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ఇవాళ అఖండ సినిమా థ్యాంక్స్ మీటింగ్ లో తలసాని పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుందని…తెలంగాణలో టికెట్ ధరలు పెంచాం, ఐదో ఆటకు అనుమతి ఇచ్చామని గుర్తు చేశారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్ గా ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని.. సినిమాకు కులం, మతం ప్రాంతాలు ఉండవన్నారు. సినిమా ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమేనని… తెలంగాణలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు తలసాని.