చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో చాలా జంటలు.. తమ అన్యోన్యమైన దాంపత్య జీవితానికి పుల్ స్టాప్ పెడుతున్నాయి. ఇప్పటికే అమీర్ ఖాన్, సమంత లాంటి తదితరులు… విడాకులు తీసుకున్నారు. అలాగే కొంత మంది స్టార్లు.. కొన్ని రోజులు ప్రేమ వ్యవహారం నడిపి… తమ లవ్ కు బ్రేకప్ చెప్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ జంట అర్జున్ కపూర్, మలైకా అరోరా తమ బంధానికి బ్రేక్ అప్ చెప్పినట్లు సమాచారం అందుతోంది.
ఇప్పటికే వీరు దూరంగా ఉంటున్నారని… ఒకరిని మరొకరు కలవడం లేదని సమాచారం. ఈమధ్య మాల్దీవుల కు వెళ్లిన ఈ జంట… అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసింది. అయితే అక్కడి నుంచి తిరిగి ఇండియాకు వచ్చినా అనంతరం వీరి మధ్య గ్యా ప్ పెరిగినట్లు సమాచారం అందుతోంది. వీరిద్దరూ పరస్పర నిర్ణయం మేరకే విడిపోయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని సమాచారం.