ఈరోజుల్లో జీన్స్ వాడని వారంటూ ఎవరూ ఉండరూ. అన్నీ ఏజ్ గ్రూప్స్‌వాళ్లు జీన్స్‌ని ధరించటానికి ఇష్టపడుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో జీన్స్ ఒక భాగం అయిపోయింది. అయితే నార్మల్ డ్రస్‌ల్లా వీటిని వేసుకున్న ప్రతిసారి ఉతకకూడదు. చాలామంది రెండుమూడుసార్లు వేసుకున్నాకే ఉతుకుతారు. కానీ కొందరూ మొదటిసారి వేసుకున్నప్పుడే..ఉతకేస్తారు. జీన్స్‌ని పదే పదే ఉతకడం మంచి పద్దతి కాదంటున్నారు నిపుణులు.
ప్రపంచంలోని మొట్టమొదటి జీన్స్ సృష్టికర్త, ప్రపంచవ్యాప్త ప్రసిద్ధ జీన్స్ కంపెనీ లెవిస్ CEO చిప్ బెర్గ్ జీన్స్‌ని ఎప్పుడూ ఉతకకూడదని చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం, లేవిస్ తన వెబ్‌సైట్‌లో జీన్స్‌ను ఎప్పుడూ ఉతకకూడదని బ్లాగులో తెలిపారు. వాషింగ్ మెషీన్లో జీన్స్ ఉతకడం అవసరం లేదు. అవసరమైతేనే అది చేయాలట.
చిప్ బెర్గ్ ఏం చెప్తున్నారంటే..
జీన్స్ ఉతకొద్దు అంటున్నారు. మరి అది శుభ్రం చేయటం ఎలా అనేగా మీ డౌట్..దానికొక మార్గం చెప్పాడు. జీన్స్ పై ఏదైనా మరకపడితే.. టూత్ బ్రష్‌తో శుభ్రం చేయాలన్నాడు. జీన్స్‌ని ఉతకడం వల్ల దాని పదార్థం దెబ్బతింటుందని, నీరు కూడా వృథా అవుతుందని చిప్ బెర్గ్ అంటున్నారు. కొత్త జీన్స్‌ను కనీసం 6 నెలల తర్వాత మాత్రమే ఉతకాలట. అప్పుడే అది మంచిగా కనబడుతుందని చెప్పాడు. జీన్స్ నుంచి బ్యాక్టీరియాను నివారించడానికి మాత్రం రాత్రిపూట ఫ్రిజ్‌లో పెట్టాలన్నాడు. ఉదయం అందులో నుంచి తీసి ఎండలో ఆరేయాలని సూచించాడు. ఇది మరీ వింతగా ఉంది కదూ..కానీ ఆయన అలా చెప్తున్నారులేండి.
ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజుల వరకు దానిని ఉతకవలసిన పనిలేదన్నాడు. జీన్స్ శుభ్రంగా లేదని మీకు అనిపిస్తే.. చల్లటి నీటితో ఉతకాలన్నాడు. జీన్స్‌ను ఇతర బట్టల నుంచి విడిగా ఉతకాలి. అంతేకాదు వాషింగ్ మెషీన్లో కాకుండా చేతితోనే శుభ్రం చేయాలట. అంతేకాకుండా వాషింగ్ గురించిన సమాచారం జీన్స్ ట్యాగ్ మీద ఉంటుందని అందుకు అనుగుణంగానే జీన్స్‌ను శుభ్రపరచాలని తెలిపాడు.
ఇలా జీన్స్ సృష్టికర్త జీన్స్ శుభ్రం గురించి చెప్తున్నారు. జీన్స్ విషయంలో చాలామంది దాదాపు ఇలానే ఉంటారు..జీన్స్‌లను నీడలోనే ఆరవేయాలి. ఇంతకీ మీరు మీకు ఇష్టమైన జీన్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.?
– Triveni Buskarowthu