పాకిస్థాన్ మరో చెత్త రికార్డ్… ప్రపంచంలో అత్యంత ‘వరస్ట్’ ఎయిర్ లైన్స్ లో పీఐఏ

-

తీవ్రవాదం ఓ వైపు, పీకల్లోతు అప్పులు మరోవైపు.. తినడానికి తిండికి కూడా అల్లాడుతోంది దాయాది దేశం పాకిస్తాన్. ఇప్పటికే సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తూ.. భారత్ పైకి ఎగదోస్తోంది. కనీసం అప్పులు చేద్దాం అన్న ఎక్కడా అప్పులు పుట్టని పరిస్థితి. ఇదిలా ఉంటే మరో చెత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఎయిర్‌లైన్ రేటింగ్స్ చేసిన అధ్యయనం ప్రకారం, పాకిస్తాన్ జాతీయ విమానయాన సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA)తో అత్యంత చెత్త ఎయిర్ లైన్స్ గా రికార్డుకెక్కింది. దీంతో పాటు మరో ఆరు ఏయిర్ లైన్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సదరు అధ్యయనం ఎయిర్ లైన్స్ భద్రత, స్టాండర్డ్స్ ప్రకారం 1-7 స్టార్ రేటింగ్స్ ఇస్తే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కేవలం ఒక స్టార్ సాధించింది. 2020లో కరాచీ జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో విమానాన్ని ల్యాండ్ చేసే ప్రయత్నంలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ A320 రద్దీగా ఉండే ప్రదేశంలో కూలిపోయి 100 మంది మరణించారు. దీంతో పాటు ఇంజెన్ ఫెయిల్యూర్లలో కూడా పీఐఏ ముందుంది. దీంతో భద్రత పరంగా చెత్త ఎయిర్ లైన్స్ గా నమోదైంది.

మరో 6 ఎయిర్‌లైన్స్ ఎయిర్ అల్జీరీ, శ్రీవిజయ ఎయిర్, స్కాట్, ఇరాన్ అసెమాన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్‌బ్లూ మరియు బ్లూ వింగ్ ఎయిర్ లైన్స్ లు కూడా అత్యంత వరస్ట్ ఎయిర్ లైన్స్ జాబితాలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news