మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే రవితేజ హీరోగా నటిస్తున్న కిలాడి సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అదే విధంగా రామారావు ఆన డ్యూటీ అనే మరో సినిమాలో రవితేజ నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ నిజాయితీ గల ప్రభుత్వ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక రవితేజ హీరోగా నటిస్తున్న మరో సినిమా రావణాసుర. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ రోజే ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. అదే విధంగా ఈ సినిమాలో శుషాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు జరిగిన పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ మాస్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.