సినిమా టికెట్ల అంశంపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్ తో నిన్న మెగాస్టార్ చిరంజీవి భేటీ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి సీఎం జగన్ నివాసానికి వెళ్లి గంట ఇరవై నిమిషాలు సీఎం జగన్ తో సినిమా ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. అనంతరం సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. 15 రోజుల్లో పరిశ్రమకు అనుకూలంగా గుడ్ న్యూస్ రాబోతుందని చెప్పారు. ఇక చిరంజీవి సింగిల్ గా వెళ్లి సీఎం జగన్ కలవడంపై పలు విమర్శలు కూడా వచ్చాయి.
కానీ తనను సీఎం ఆహ్వానించారని చిరు చెప్పారు. అయితే తాజాగా చిరంజీవి సీఎంతో భేటీ కావడం పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ కు నిరంజన్ రెడ్డి చేదోడు వాదోడుగా ఉన్నారని అన్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అందుకే చిత్ర పరిశ్రమకు న్యాయం చేయడానికి జగన్ తో చిరంజీవి భేటీ ఏర్పాటు చేయించారని ఆరోపించారు. ఇక రఘురామ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.