బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పై ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. సొంత పార్టీ నుంచే కాకుండా… ప్రతిపక్ష పార్టీలు బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేాయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార నివాసంలో మద్యం పార్టీ ఇవ్వడంతో పాటు.. విందులో చిందేయడం ప్రస్తుతం బ్రిటన్ లో చర్చనీయాంశంగా మారింది. కరోనా ఆంక్షల సమయంలో మద్యం పార్టీ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ప్రిన్స్ ఫిలిప్ మరణం సమయంలో మద్యం తాగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మూడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు జాన్సన్ రాజీనామాను డిమాండ్ చేశాయి. అతని స్వంత కన్జర్వేటివ్ ఎంపీలలో ఐదుగురు అతనిని నిష్క్రమించాలనే పిలుపులకు బహిరంగంగా చేరారు.
ఇదిలా ఉంటే బోరిస్ జాన్సన్ రాజీనామాతో భారతీయ సంతంతి మంత్రికి మద్దతు పెరుగుతోంది. బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ ప్రధాని పీఠాన్ని అధిష్టిస్తాడని అక్కడి మీడియా కోడై కూస్తోంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి రిషి అల్లుడు.