మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ఖిలాడీ. ఈ సినిమాను సత్యనారాయరణ కోనేరు నిర్మిస్తుండగా… రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. 2021 చివరలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా.. జాప్యం చోటు చేసుకుంది. ఇక ఈ సంక్రాంతికి అయినా సినిమా వస్తుందని అనుకున్నారు.
ఈ నేపథ్యంలోనే.. ఫిబ్రవరి 11 వ తేదీన సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటన చేసింది. అయితే.. సంక్రాంతి కానుకగా ఓ అదిరిపోయే పోస్టర్‌ను వదిలింది చిత్ర బృందం. ఐరన్ రాడ్ పట్టుకుని యాక్షన్ లోకి దిగినట్లుగా కనిపిస్తున్న రవితేజ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటాయనేది ఈ పోస్టర్ చెప్పేస్తోంది.
యాక్షన్ ఎపిసోడ్స్ లో రవితేజ దుమ్మురేపేస్తాడనే విషయం అర్థమౌవుతుంది. అటు రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా నుంచి కూడా చిత్ర బృందం.. ఓ ఫ్యామిలీ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో ఎల్లో షర్ట్ వేసుకుని.. లుంగీ కట్టుకుని… అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఇక ఈ సినిమా మార్చి 25 న విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటన చేసింది.