11 ఏళ్ల బాలికపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి

-

కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్‌ హవేలీలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వం ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న తల్లి వెంట ఉన్న 11 సంవత్సరాల బాలిక పై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. అతడు ఎవరో కాదు… ఆ ఆస్పత్రి లో పనిచేసే సెక్యూరిటీ గార్డే. దమణ్‌ జిల్లాలోని మార్వాడ్‌ ప్రభుత్వ ఆస్పత్రి లో జనవరి 11 వ తేదీన ఈ అమానుష సంఘటన చోటు చేసుకుంది.

అక్కడ చికిత్స పొందుతున్న తన తల్లితో కలిసి బాలిక ఉందని అధికారులు చెప్పారు. చిన్నారికి తాగునీరు ఇచ్చే నెపంతో… ఆ ప్రభుత్వ ఆస్పత్రి లోని ఓ గదిలోకి తీసుకెళ్లి… బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు అధికారులు స్పష్పం చేశారు. ఈ సంఘటన బయటపడిన అనంతరం ఆస్పత్రి నుంచి సెక్యూరిటీ గార్డు పారి పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం విస్తృతంగా గాలించారు. అయితే… నిన్న అర్ధరాత్రి నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news