నా బెస్ట్ సమంత…మరో సారి నాగచైతన్య షాకింగ్ కామెంట్స్…!

-

నాగార్జున నాగచైతన్య హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమాలో నాగ్ కు జోడిగా రమ్యకృష్ణ నటించగా చైతూ కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో చైతూ, నాగ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇంటర్వ్యూ లలో నాగచైతన్య సమంత గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో నాగచైతన్య మాట్లాడుతూ…ఇప్పుడు ఇదే సరైన నిర్ణయం..ఇద్దరం విడిపోయాం తను హ్యాపీగా ఉంది, నేను హ్యాపీ గా ఉన్నాను అంటూ స్పందించారు. అయితే తాజాగా మరోసారి సమంత పేరు చైతూ నోట వినిపించింది. మీ బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ ఎవరు అంటూ యాంకర్ ప్రశ్నించగా చైతూ ఆలోచించకుండా సమంత అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక వీరిద్దరి కాంబో లో ఏమ్మయ చేసావే,మజిలీ, మనం సినిమాలు రాగా మంచి విజయం సాధించాయి.

Read more RELATED
Recommended to you

Latest news