రాజకీయాలకు అడ్డగా బీసీసీఐ..కోహ్లీపై నిర్ణయంపై సీపీఐ నారాయణ సంచలనం!

-

టీమిండియా టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకుని విరాట్‌ కోహ్లీ అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. కోహ్లీ తీసుకున్న ఆ నిర్ణయంతో… టీమిండియా క్రికెటర్లతో పాటు మాములు వ్యక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అనేక మంది కోహ్లీ నిర్ణయం పై స్పందిస్తున్నారు. కోహ్లీ కెప్టెన్సీ పై ప్రశంసలు కూడా కురుపిస్తున్నారు. అయితే.. తాజాగా కోహ్లీ తీసుకున్న నిర్ణయం పై సీపీఐ నారాయణ చాలా విభిన్నంగా స్పందించారు.

బీసీసీఐ రాజకీయాలకు అడ్డగా మారిందని.. అమిత్‌ షా కొడుకు జై షా ను ఉద్దేశించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా రాకతో బీసీసీఐ రాజకీయాలకు వేదికగా మారిందని… క్రికెట్‌ లో ప్రతి ఆటగాడు సంతృప్తి కరమైన స్థాయికి చేరుకున్న తర్వాత వీడ్కోలు పలకడం సహజమన్నారు. బీసీసీఐ కార్యదర్శిగా జై షా ప్రవేశంతో పరిస్థితులు భిన్నంగా మారిపోయాయని మండిపడ్డారు. బోర్డు రాజకీయాలకు నిలయమవడంతో ప్రతిభావంతులు రాణించలేకపోతున్నారని.. ఎంపికలో రాజకీయాలు జరుగుతున్నాయని నిప్పులు చెరిగారు. కోహ్లీ విషయంలోనూ ఇదే జరిగిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news