తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్… నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం.

తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. గత వారం నుంచి ఏపీ, తెలంగాణ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.  నేను కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. ఏపీలో తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీంతో మరో 2రోజులు మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇదిలా ఉంటే తెలంగాణలో వారం రోజుల నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నేడు కూడా పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువనున్నాయి.

 రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే వర్షాలు కారణంగా రాష్ట్రంలో  ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల నుంచి చలిగాలులు వీస్తుండటంతో చలి ఎక్కువగా ఉంటోంది. దీంతో పలు ప్రాంతాల్లో పొగ మంచు ప్రభావం కూడా పెరిగాయి. తెలంగాణలో గత వారం నుంచి కురుస్తున్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మిర్చి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి.