ప్రపంచంలో అపర కుబేరుడు స్పెస్ ఎక్స్, టెస్లా కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ కు మన దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అని ఇటీవల ఎలాన్ మస్క్ ట్విట్ చేశారు. దేశంలో ఎలక్ట్రాక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కంపెనీని ప్రారంభించేందుకు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నా అని ఈనెల 13న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎలాన్ మస్క్ ఇలా స్పందించారు.
దీంతో పలు రాష్ట్రాలు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఎలాన్ మస్క్ కంపెనీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ విషయంపై ఎలాన్ మస్క్ కు ట్విట్ కూడా చేశారు. తెలంగాణలో టెస్లా కంపెనీని స్థాపించాలని ట్విట్ కూడా చేశారు. ఇదిలా ఉంటే పలు రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాల్లో టెస్లా కంపెనీని ప్రారంభించాలంటూ.. ఎలాన్ మస్క్ కు ట్విట్స్ చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఆహ్వానించగా… పంజాబ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి.