ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిందే. రాజధాని మార్పు తో ఏపీలో కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో ఏపీకి భారీగా రాబడులు తగ్గుతున్నాయి. అయినప్పటికీ.. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం చాలా రకాల సంక్షేమ పథకాలను తీసుకువచ్చి.. విజయవంతంగా అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా వైఎస్సార్ జగనన్న కాలనీ పేరుతో కొత్త స్కీమ్ ను ప్రారంభించింది జగన్ సర్కార్.
వైఎస్సార్ జగనన్న కాలనీల్లో రోజుకు రూ. 30 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. తక్కువ ధరలకే ప్లాట్లు ఇవ్వడమే.. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. తొలిదశలో భాగంగా శంకుస్థాపన చేసిన 10.87 లక్షల ప్లాట్లలో వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. పలు లేఅవుట్‌లలో రీలెవలింగ్, గోడౌన్ల నిర్మాణం, నీటి సరఫరా, ఇతర సౌకర్యాల కోసం రూ.228.6 కోట్ల పనులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే.. .వైయస్ఆర్ జగనన్న కాలనీల్లోని ఇళ్లలో ఇంధన సామర్థ్య ప్రమాణాలు అమలు చేసేందుకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ముందుకొచ్చింది జర్మనీకి చెందిన KFW బ్యాంక్. ఇందు కోసం 150 మిలియన్ యూరోలు , సాంకేతిక సహకారం కోసం మరో 2 మిలియన్ యూరోలు అందచేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని ప్రకటన చేసింది KFW బ్యాంక్. దీంతో జగన్ సర్కార్ కు భారీ ఊరట లభించనుంది.