వైసీపీ రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీపై ఏదో ఒక టాపిక్ ఎంచుకుని విమర్శలు చేస్తూ ఉంటారు విజయ సాయిరెడ్డి. అయితే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంపై తీసుకున్న నిర్ణయం పై కామెంట్ చేశారు విజయసాయి.
”తెలంగాణ ప్రభుత్వం కూడా గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. విధివిధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. తమ పిల్లలను మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తూ పేద పిల్లలకు ఆ అవకాశం వద్దని ‘ఏడుస్తున్న’ బాబు గ్యాంగు దీనిపై ఎలా స్పందిస్తుందో?” చంద్రబాబు పై సెటైర్లు పేల్చారు విజయసాయిరెడ్డి. కాగా… తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వం పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. వచ్చే ఆకాడమిక్ ఇయర్ నుంచే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య అందించేందుకు ఆమోదం తెలిపింది.