బాలకృష్ణ చిన్న అల్లుడి పై నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్..!

-

నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ తరుణంలో తాజాగా ఈ నటి ఏపీ రాజకీయాల పై స్పందించి, షాకింగ్ ట్వీట్ చేసింది. బాలకృష్ణ చిన్నల్లుడి పై ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె తన అకౌంట్లో పొలిటికల్ సినారియో చూస్తుంటే బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీ భరత్ ఏదో సాధించేలా కనిపిస్తున్నాడంటూ ట్వీట్ చేసింది.

అలాగే.. ఆయనకు ఎడ్యుకేషన్ భవిష్యత్తుపై మంచి విజన్ ఉంది అది కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకూడదు, వైజాగ్ నుంచి గెలిచి పార్లమెంట్కు వెళితే బాగుంటుందని తెలిపింది. అదే విధంగా తాను భరతకు సపోర్ట్ చేస్తున్నాననే భావించాలని, ఇది డబ్బులు ఇచ్చో లేక స్పాన్సర్ ట్వీట్లో కాదు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇక భర్త విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఆయన గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో పూనమ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news